ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు

ABN, First Publish Date - 2022-04-25T08:42:43+05:30

‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ‘ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగానూ విలువల్లేని వ్యక్తి

ఆయన గురించి రెండో మాజీ భార్య రేణుదేశాయ్‌ని అడిగితే తెలుస్తుంది: మంత్రి గుడివాడ


విశాఖపట్నం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ‘ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు... రాజకీయ జీవితంలో కూడా విలువల్లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది’’ అని మంత్రి గుడివాడ అమరనాఽథ్‌ విమర్శించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పవన్‌ కల్యాణ్‌  ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది మేం చెప్పడం కంటే ఆయన రెండో మాజీ భార్య రేణుదేశాయ్‌ని అడిగితే తెలుస్తుంది. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్‌ కల్యాణ్‌కు లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు నిలకడలేదు. ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని, తర్వాత కారణం లేకుండానే విడిపోతుంటారు. ‘జగన్‌ పాలన జనరంజకంగా ఉంటే నేను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటాను’ అని గత ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఇప్పుడు జగన్‌ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు చెబుతున్నందున ఆయన సినిమాలు చేసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోసమే జనసేన పార్టీని ప్రారంభించారు. చంద్రబాబు స్ర్కిప్ట్‌ ప్రకారమే పవన్‌ కల్యాణ్‌ నడుచుకుంటున్నారు. జగన్‌ వైసీపీని స్థాపించిన తరువాతే కాంగ్రెస్‌ పార్టీ సీబీఐతో కేసులు పెట్టించింది. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ  నామరూపాల్లేకుండా పోయిందనే విషయాన్ని టీడీపీ, జనసేన సహా ప్రతిపక్షాలన్నీ గుర్తుపెట్టుకోవాలి’’ అని మంత్రి అమరనాథ్‌ అన్నారు. 

Updated Date - 2022-04-25T08:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising