జీఎస్ఎల్వీ ప్రయోగానికి రెడీ
ABN, First Publish Date - 2022-10-21T11:30:29+05:30
మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న జీఎ్సఎల్వీ-మార్క్3 (ఎల్వీ-ఎం 3) రాకెట్ ప్రయోగానికి
నేటి రాత్రి కౌంట్‌డౌన్ ప్రారంభం
36 ఉపగ్రహాలతో నింగిలోకి రాకెట్
సూళ్లూరుపేట, అక్టోబరు 20: మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న జీఎ్సఎల్వీ-మార్క్3 (ఎల్వీ-ఎం 3) రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వన్‌వెబ్ ఇండియా-1 పేరుతో యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి పంపనుంది. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హాజరు కానున్నారు. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 21న అర్ధరాత్రి తర్వాత అంటే 22న 12.07 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. 24గంటల కౌంట్‌డౌన్ పూర్తవగానే 23న 12.07గంటలకు జీఎ్సఎల్వీ-మార్క్3 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
5,200 కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను జీఎ్సఎల్వీ-మార్క్3 రాకెట్ కక్ష్యలోకి చేర్చనుంది. రాకెట్ భూమి నుంచి ఎగిరిన అనంతరం 16.21 నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆఽధీనంలోకి తీసుకుంటారు.
వచ్చే ఏడాది జూన్‌లో చంద్రయాన్-3
చంద్రునిపై అధ్యయనం కోసం చంద్రయాన్-3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం ప్రకటించారు. ఇస్రో 2019లో చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే. అలాగే చంద్రునిపైకి మానవ సహిత వ్యోమనౌకను పంపే ప్రాజెక్టు గగనయాన్‌కు సంబంధించిన తొలి ప్రయోగ పరీక్ష కూడా వచ్చే ఏడాది చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 2024 చివరి నాటికి వ్యోమగాములతో కూడిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-10-21T11:30:29+05:30 IST