ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

61 సీడీపీవో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

ABN, First Publish Date - 2022-12-16T01:00:05+05:30

ఖాళీగా ఉన్న 61 సీడీపీవో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇందుకు ఆమోదం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు

మహిళ, శిశు సంక్షేమ శాఖపై జగన్‌ సమీక్ష

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఖాళీగా ఉన్న 61 సీడీపీవో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇందుకు ఆమోదం తెలిపారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళ, శిశు సంక్షేమ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న సీడీపీవో పోస్టుల వివరాలను సీఎంకు అధికారులు అందజేశారు. వీటి నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. వేగవంతంగా ఈ ప్రక్రియ చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఇతర పోస్టులను భర్తీ చేయాలని జగన్‌ ఆదేశించారు. అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. నాడు-నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. అంగన్వాడీల్లో కరికులమ్‌ మార్చాలని, ఇందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. అంగన్వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది వేయాలని, ఉత్తమ అభ్యాసాలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి, మహిశ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising