ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందుడి హుండీ గలగల!

ABN, First Publish Date - 2022-10-17T09:37:42+05:30

తిరుమల ఏడుకొండల స్వామికి ఏడు నెలల్లో ఏకంగా రూ.911.19 కోట్ల హుండీ ఆదాయం లభించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కానుకలు భారీగా సమకూరుతున్నాయి. కొవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు పరిమిత భక్తులతో తిరుమల కొండలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీవారికి ఏడు నెలల్లో రూ.911.19 కోట్లు 

కరోనా తర్వాత భారీగా భక్తుల కానుకలు 

ఆగస్టులో ఏకంగా 140.07 కోట్లతో రికార్డు 

ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్ల 

ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా 

ఏడు నెలల్లోనే లక్ష్యానికి చేరువలో... 


(తిరుమల-ఆంధ్రజ్యోతి)

తిరుమల ఏడుకొండల స్వామికి ఏడు నెలల్లో ఏకంగా రూ.911.19 కోట్ల హుండీ ఆదాయం లభించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కానుకలు భారీగా సమకూరుతున్నాయి. కొవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు పరిమిత భక్తులతో తిరుమల కొండలు వెలవెలపోయింది. 2020 మార్చి 21 నుంచి జూన్‌ 7 వరకు 79 రోజుల పాటు భక్తులకు స్వామివారు దూరమయ్యారు. ఆ తర్వాత కొవిడ్‌ నిబంధనలతో దర్శనాలను తిరిగి ప్రారంభించినా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. కొవిడ్‌ ప్రభావం తగ్గాక ఈ ఏడాది మార్చి నుంచి భక్తులను దర్శనాలకు భారీగా అనుమతించడంతో పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలనూ టీటీడీ తిరిగి ప్రారంభించింది. అప్పటినుంచి కొవిడ్‌ ముందుకంటే భారీగా హుండీ ఆదాయం సమకూరడం మొదలైంది. మార్చి నుంచి సెప్టెంబరు వరకు ఏకంగా రూ.911.99 కోట్లు సమకూరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆగస్టులో ఏకంగా రూ.140.07కోట్ల ఆదాయం రావడం టీటీడీ చరిత్రలోనే రికార్డు. కొవిడ్‌ ముందు వరకు రూ.3కోట్ల హుండీ ఆదాయం వస్తేనే రికార్డు అనుకునేవారు.


ప్రస్తుతం రోజూ సగటున రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకూ సమకూరుతోంది. టీటీడీ ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లోనూ హుండీ ఆదాయం రూ.వెయ్యి కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే ఏడు నెలల్లోనే ఆ లక్ష్యానికి చేరువైంది. 2021-22 బడ్జెట్‌లో హుండీ ద్వారా రూ.1,131 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా.. కరోనా కారణంగా రూ.933 కోట్లు మాత్రమే లభించింది. అలాగే 2020-21లోనూ కేవలం రూ.731 కోట్లే సమకూరింది. 




Updated Date - 2022-10-17T09:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising