ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌడల అభ్యున్నతికి ప్రభుత్వాల కృషి

ABN, First Publish Date - 2022-08-08T08:05:16+05:30

గౌడల అభ్యున్నతికి ప్రభుత్వాల కృషి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ, తెలంగాణ మంత్రులు జోగి రమేష్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ 

రవీంద్రభారతిలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి

హైదరాబాద్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): గౌడ జాతి అభ్యున్నతికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రులు జోగి రమే్‌ష(ఏపీ), శ్రీనివా్‌సగౌడ్‌(తెలంగాణ) తెలిపారు. గౌడలు ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా ఎదగాలని సూచించారు. జైగౌడ ఉద్యమం సంఘం ఆధ్వర్యంలో సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 372వ జయంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఏపీ మంత్రి జోగి రమేష్‌, తెలంగాణ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ తదితరులు సర్వాయి పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్యఅతిథి జోగి రమేష్‌ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో గౌడ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నారు. సర్వాయి పాపన్నను బహుజన చక్రవర్తిగా అభివర్ణించారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణలో గౌడ వృత్తిని బతికించేందుకు నీరా పాలసీ తీసుకొస్తున్నామన్నారు. గౌడలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. నీరా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రిని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. త్వరలో పొట్టి తాటి చెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో కులవృత్తులను జగన్‌, కేసీఆర్‌ బతికిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జై గౌడ్‌ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు, తెలంగాణ అధ్యక్షుడు నరేష్‌ గౌడ్‌, ఏపీ అధ్యక్షుడు చిల్లిగార కిషోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T08:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising