ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం చూస్తోంది: పీడీఎఫ్ ఎమ్మెల్సీలు

ABN, First Publish Date - 2022-01-27T21:56:04+05:30

రాష్ట్రంలోని 35,000 స్కూళ్లను మూసివేయాలని జగన్ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని 35,000 స్కూళ్లను మూసివేయాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. నూతన విద్యావిధానంపై సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాన్ని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్‌ సాబ్జి, రఘువర్మ బహిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లల దగ్గరకు బడి కాకుండా బడి దగ్గరకు పిల్లలు అని తీసుకువచ్చారని వారు ఆరోపించారు. కేవలం ఎకానమీ కోసం ఈ మెర్జింగ్‌ను తెరమీదకు తెచ్చారని వారు పేర్కొన్నారు. నూతన జాతీయ విద్య విధానం విషయంలో వారు చెప్పనవి కూడా ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీ సహా బయట కూడా పోరాటం చేస్తామని వారు ప్రకటించారు.


నాడు-నేడు ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు వాటిల్లో పిల్లలు లేకుండా మూసేస్తున్నారని వారు ఆరోపించారు. ఏపీలో కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ తరహా విద్యను ప్రోత్సహించాలని వారు కోరారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమావేశాన్ని బహిష్కరించామని ఎమ్మెల్సీలు తెలిపారు. 

Updated Date - 2022-01-27T21:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising