ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap Governmentపై తీవ్ర అసంతృప్తి.. వాట్సప్ గ్రూపుల్లో ఉద్యోగుల సెటైర్లు

ABN, First Publish Date - 2022-08-08T00:04:49+05:30

40 నుంచి 50 శాతం మందికి ఇంకా వేతనాలు (Salaries) అందలేదని ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 40 నుంచి 50 శాతం మందికి ఇంకా వేతనాలు (Salaries) అందలేదని ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం (Secretariate), హైకోర్టు (High Court), ఇతర కీలక విభాగాల ఉద్యోగులకు వేతనాలు అందాయని చెబుతున్నారు. కొన్ని శాఖల్లో కొంతమందికి మాత్రమే బ్యాంక్ అకౌంట్ (Bank Account)‎లో జీతాలు జమ అయ్యాయని.. అదే శాఖలో మరికొందరికి వేతనాలు అందలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున కూడా వేతనాలు వేయలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వంపై ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు వేస్తున్నారు. వేతనాలు వేస్తే వెంటనే ఖర్చు చేసుకుంటారని.. అందుకే వేయలేదని కొందరు సెటైర్లు వేస్తుంటే.. ప్రతినెలా అలవాటే కదా అని మరికొందరు అంటున్నారు. EMIలు ఎలా కట్టాలంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. నిధులు లేకనే జీతాలు ఆలస్యమయ్యాయని ఇంకొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాల్సి రావడంతో ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయని ఉద్యోగులు వాపోతున్నారు. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం తర్వాత వచ్చే నిధులతో సర్దుబాటు చేస్తారేమోనని ఉద్యోగులు అంటున్నారు. 




Updated Date - 2022-08-08T00:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising