ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gorantla Madhav: ఫేక్ వీడియో అని మొదటినుంచి చెబుతూనే ఉన్నా: ఎంపీ గోరంట్ల

ABN, First Publish Date - 2022-08-20T00:47:41+05:30

ఫేక్ వీడియో అని మొదటినుంచి చెబుతూనే ఉన్నానని ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) మరోసారి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఫేక్ వీడియో అని మొదటినుంచి చెబుతూనే ఉన్నానని ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) మరోసారి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల దర్యాప్తులో కూడా అది ఫేక్ వీడియో అని చెప్పారని, అది రుచించని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మళ్లీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్లిప్స్ ల్యాబ్‌ నుంచి ఓ ఫేక్‌సర్టిఫికెట్ తీసుకొచ్చి.. అదే నిజమని నమ్మించాలని చూశారని విమర్శించారు. సీఐడీ (CID) విచారిస్తే అది తాము ఇచ్చిన సర్టిఫికేట్ కాదని ఎక్లిప్స్ చెప్పిందన్నారు. గతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడారని, ఇవన్నీ టీడీపీ నేతలకు, మీడియాకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియో సృష్టించి తనను వేధించాలని చూశారని తెలిపారు. ఫేక్‌ వీడియో పట్టుకొని చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఫేక్‌వీడియో, ఆరోపణలు చేసినవారిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని గోరంట్ల మాధవ్ ప్రకటించారు.

Updated Date - 2022-08-20T00:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising