ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తల కోసం హింసావాదిగా మారతా: గొల్లబాబూరావు

ABN, First Publish Date - 2022-04-13T21:54:35+05:30

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెద్ద దుమారం రేపుతోంది. ఆశావహులు చెలరేగిపోతున్నారు. వారిని శాంతింపజేసేందుకు దూతలు చర్చలు జరుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెద్ద దుమారం రేపుతోంది. ఆశావహులు చెలరేగిపోతున్నారు. వారిని శాంతింపజేసేందుకు దూతలు చర్చలు జరుపుతున్నారు. అయినా వారిని శాంతింపజేయడం అధికార పార్టీకి తెలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే గొల్లబాబూరావు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని సీఎం జగన్‌కు అల్టిమేటం జారీ చేశారు. బుధవారం బాబూరావు మీడియాతో మాట్లాడుతూ జగన్ కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. బలమైన కాంగ్రెస్‌ను ఎదిరించానని తెలిపారు. తన కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని హెచ్చరించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినా మంత్రి పదవి ఇవ్వలేదని వాపోయారు. తన కోసం వందల మంది నాయకులు.. పాయకరావుపేట నుండి తరలివచ్చారని తెలిపారు. ఇకపై అగ్రెసివ్‌గా ముందుకెళ్తానని బాబూరావు హెచ్చరించారు.


మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగలు వైసీపీలో ఇంకా తగ్గలేదు. కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పదవి రానందుకు అసంతృప్తి లేదంటూనే పలువురు నేతలు అలకబూనారు. పదవులు ఆశించి భంగపడిన వారి అనుచరులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ నిర్ణయాలకు తిరుగులేదు. 2019 మే 8న కొలువుతీరిన తొలి మంత్రివర్గం కూర్పుపైనా ఆయన్ను వేలెత్తిచూపేందుకు ఎవరూ సాహసించలేదు. కానీ మూడేళ్లకే పరిస్థితులు మారిపోయాయి.  పునర్వ్యవస్థీకరణపై నిరసనలు హోరెత్తాయి. పైకి అంతా బాగుందంటున్నా.. పదవి దక్కని నేతల ముఖాల్లో చిరునవ్వే కరువైంది. ఇప్పటి వరకూ తనవాళ్లు తనను పొగడ్తలతో ముంచెత్తడం, ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడమే చూసిన జగన్‌కు.. వాళ్ల అసంతృప్తి, వారి అనుచరులు, కార్యకర్తల ఆగ్రహావేశాలు నివ్వెరపరిచాయని అంటున్నారు.

Updated Date - 2022-04-13T21:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising