ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16న వరసిద్ధుడి స్వర్ణ రథం ప్రారంభం.. CM YS Jagan విచ్చేసే అవకాశం!

ABN, First Publish Date - 2022-02-12T12:11:18+05:30

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామికి నూతనంగా తయారు చేయించిన స్వర్ణ రథాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/ఐరాల(కాణిపాకం) : కాణిపాక వరసిద్ధి వినాయకస్వామికి నూతనంగా తయారు చేయించిన స్వర్ణ రథాన్ని ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. స్వర్ణ రథ నిర్మాణాన్ని టీటీడీ వారు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ఆలయాధికారులు రూ.6కోట్లను వెచ్చించారు. ప్రారంభోత్సవలో భాగంగా.. ఈనెల 14న సాయంత్రం నాలుగు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, అనుజ్ఞ, పుణ్యాహవచనం, వాస్తు శాంతి, ప్రవేశ బలి, కలశ స్థాపన, మొదటి కాల పూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. 


15న ఉదయం తొమ్మిది గంటలకు కలశ పూజ, రెండో కాల పూజ, నయనోన్‌మిలనం, హోమం, పూర్ణాహుతి, సాయంత్రం నాలుగు గంటలకు కలశ పూజ, మూడో కాల పూజ, హోమం, పూర్ణాహుతి ఉంటాయి. 16న ఉదయం తొమ్మిది గంటలకు కలశ పూజ, నాల్గవ కాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, నూతన స్వర్ణ రథానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను కాణిపాకం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. స్వర్ణ రథ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి విచ్చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2022-02-12T12:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising