ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 11 వరకు సీఎంకు టైం ఇస్తున్నా... ఏం చేస్తారో చేసుకోండి: రఘురామ

ABN, First Publish Date - 2022-01-29T21:01:10+05:30

‘అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నా.. ఏం చేస్తారో చేసుకోండి’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ‘‘అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నా.. ఏం చేస్తారో చేసుకోండి’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు కేసు పెట్టాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి రావొచ్చన్నారు. వైసీపీ నేత శివశంకర్‌రెడ్డి తరపున ప్రభుత్వ లాయర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి వాదించారని, ప్రభుత్వ తరపు న్యాయవాది పార్టీకి, నాయకుడి తరపున కేసు ఎలా వాదిస్తారు? అని రఘురామ ప్రశ్నించారు. చంద్ర ఓబుల్‌రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మన్‌కి లేఖ రాశానని తెలిపారు. హూ కిల్ బాబాయ్ అనేది ప్రజలందరికీ తెలుసన్నారు. జిల్లాల విభజన విషయంలో వైసీపీ కేడర్‌ కూడా మండిపడుతోందన్నారు. డ్రగ్స్ నియంత్రణపై జగన్ సమీక్ష నిర్వహించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-29T21:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising