ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు గెజిట్‌

ABN, First Publish Date - 2022-01-12T08:31:24+05:30

ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ ప్రకటన ఇచ్చింది. ఈవర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. యూనివర్సిటీల చట్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా కళాశాలలు వర్సిటీ పరిధిలోకి

 

అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ ప్రకటన ఇచ్చింది.  ఈవర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. యూనివర్సిటీల చట్టం ప్రకారం అన్ని సెక్షన్లు ఈ కొత్త విశ్వవిద్యాలయానికి వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే ఇందులో ఒక సెక్షన్‌కు సంబంధించి ఉన్నతాధికారులు దృష్టిపెట్టినట్లు లేదు. విశ్వవిద్యాలయాల చట్టంలోని సెక్షన్‌ 6(ఎ)ప్రకారం ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలోకి ఆ జిల్లాలోని కళాశాలలు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆ కళాశాలలు, ఇప్పుడు ఆంధ్రకేసరి వర్సిటీ పరిధిలోకి వస్తాయని వివరించారు. కాగా, గెజిట్‌ ఇచ్చిన రోజు(మంగళవారం) నుంచే ప్రకాశం జిల్లాలోని కళాశాలలు నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా లేనట్లు అని సెక్షన్‌ 6(ఎ) పేర్కొంటోంది. దీంతో ఆ కళాశాలల్లో ఇక నుంచీ పరీక్షలను అదే విశ్వవిద్యాలయం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గెజిట్‌ ప్రకటన ఇచ్చి, ఇప్పుడే పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

Updated Date - 2022-01-12T08:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising