ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌతమ్‌రెడ్డికి జిమ్‌ అంటే ప్రాణం

ABN, First Publish Date - 2022-02-22T01:09:02+05:30

మంత్రి గౌతమ్‌రెడ్డి ఎక్కడ కనిపించినా చాలా కళ్లు ఆయన్ను ప్రత్యేకంగా గమనిస్తాయి. దానికి కారణం ఆయన శరీరాకృతి. ఆరు అడుగుల పొడవు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి గౌతమ్‌రెడ్డి ఎక్కడ కనిపించినా చాలా కళ్లు ఆయన్ను ప్రత్యేకంగా గమనిస్తాయి. దానికి కారణం ఆయన శరీరాకృతి. ఆరు అడుగుల పొడవు, కండలు తిరిగిన  శరీరాకృతి యువతరాన్ని ప్రత్యేకంగా ఆకర్షించేది. కండలు తిరిగిన ఆయన శరీరం గురించి యువత కథలు కథలుగా మాట్లాడుకునేవారు. అందరిని ఆకర్షించే ఆ కండల వెనుక గౌతమ్‌రెడ్డి కఠోర శ్రమ, క్రమశిక్షణ దాగున్నాయని చెబుతారు. జిమ్‌ గౌతంరెడ్డి ఆరవప్రాణంగా చెబుతారు. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటల సేపు ఆయన జిమ్‌లో గడుపుతారు. అందుకు అనుగుణంగా నెల్లూరు, హైదరాబాద్‌లలోని తన నివాసాల్లోనే జిమ్‌ కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకున్నారు. జిమ్‌ ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయాలు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ట్రైనర్‌ ఉంటారు. గౌతంరెడ్డి ఎక్కడికి వెళ్లినా ఈ ట్రైనర్‌ వెంట ఉండాల్సిందే. గౌతంరెడ్డి ఆహార ప్రియుడు అనే ప్రచారం ఉన్నా, ఎంత తింటారో అంత ఖర్చు చేసేవరకు జిమ్‌ రూమ్‌ వదలి బయటకు రాడని, ఆ కారణంగానే ఆయన శరీరాకృతి అంత ఫిట్‌గా ఉంటుందని అనుచరులు  చెబుతారు. 

Updated Date - 2022-02-22T01:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising