ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి బుధవారం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు

ABN, First Publish Date - 2022-02-21T21:22:05+05:30

మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం గౌతమ్‌రెడ్డి పార్థివదేహం జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసం ఉంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం గౌతమ్‌రెడ్డి పార్థివదేహం జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసం ఉంచారు. అయితే గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం నెల్లూరుకి ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తీసుకెళ్తారు. రేపు నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచుతారు. బుధవారం ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు. 


గౌతమ్‌రెడ్డి 1971 నవంబర్‌ 2న జన్మించారు. గౌతమ్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ ఆయన ఎమ్మెస్సీ చేశారు. ఈయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేసిన గౌతమ్.. తొలిసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మేకపాటికి కేబినెట్‌లో చోటిచ్చారు. ప్రస్తుతం పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా గౌతమ్ ఉన్నారు.

Updated Date - 2022-02-21T21:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising