Anakapalli: అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్
ABN, First Publish Date - 2022-06-03T19:26:29+05:30
జిల్లాలోని అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయ్యింది. సీడ్స్ యూనిట్లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకైంది.
అనకాపల్లి: జిల్లాలోని అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయ్యింది. సీడ్స్ యూనిట్లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకైంది. దీంతో వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఎస్ఈజేడ్లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేస్తున్నారు.
Updated Date - 2022-06-03T19:26:29+05:30 IST