ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ganesh immersion: భక్తులను భయపడుతున్న భారీ వినాయకుడు.. నిమజ్జనం చేయాలని నోటీసులు

ABN, First Publish Date - 2022-09-10T23:11:46+05:30

గాజువాకలో ప్రతిష్టించిన 89 అడుగుల భారీ గణేశుని విగ్రహానికి నిమజ్జనం చేయాలని పోలీసులు నోటీసులిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: గాజువాకలో ప్రతిష్టించిన 89 అడుగుల భారీ గణేశుని విగ్రహానికి నిమజ్జనం చేయాలని పోలీసులు నోటీసులిచ్చారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గాజువాక లంకా మైదానంలో 89 అడుగుల భారీ గణేశుడు కొలువుదీరాడు. ఈ భారీ గణనాథుడిని మట్టితో తయారు చేశారు. మట్టితో చేయడం వల్ల భారీ విగ్రహం ఒక అడుగుమేర పక్కకు ఒరిగింది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్ అండ్ బీ అధికారులకు సమాచారమిచ్చారు. విగ్రహాన్ని పరిశీలించిన అధికారులు భారీ గణేశుడు కూలిపోయే అవకాశముందని ఆర్ ఆండ్ బీ అధికారులు నివేదిక ఇచ్చారు.


ఈ నివేదిక ఆధారంగా ఇవాళ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిమజ్జనం చేస్తామని తెలిపారు. నిత్యం వేలాది మంది భక్తులు వినాయకుడిని దర్శించుకుంటున్నారు. అందువల్ల ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిర్వాహకులు మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. విగ్రహం ఒరిగిందని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2022-09-10T23:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising