ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం నిర్వాసితులకు పరిహారంపై షెకావత్‌ ఆరా

ABN, First Publish Date - 2022-03-04T21:06:06+05:30

పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతి, ఆర్‌అండ్‌ఆర్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ హాజరైనారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతి, ఆర్‌అండ్‌ఆర్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ హాజరైనారు. ఈ భేటీలో నిర్వాసితులకు పరిహారంపై షెకావత్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పునరావాస కల్పన కేవలం 20.19 శాతమే పూర్తికావడంపై చర్చించారు. గతంలో ఆమోదించిన ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం.. రూ.55,656.87 కోట్లకు క్లియరెన్స్ జగన్ ఇవ్వాలని కోరారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవసరమయ్యే.. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు.


సీఎం, కేంద్ర మంత్రి ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరిపేట పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అక్కడినుంచి 11.20కి పశ్చిమగోదావరిలోని తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెం కాలనీకి చేరుకుని నిర్వాసితులతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు.

Updated Date - 2022-03-04T21:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising