ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో అసెంబ్లీ చరిత్రకెక్కింది: గద్దె రామ్మోహన్

ABN, First Publish Date - 2022-03-22T17:33:48+05:30

అసెంబ్లీలో బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు ఎక్కువమంది ఉన్నారు, స్పీకర్‌కు 5-6 మీటర్ల దూరంలో ఉండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి‌: అసెంబ్లీలో బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు ఎక్కువమంది ఉన్నారు, స్పీకర్‌కు 5-6 మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలుపుతున్నా అకారణంగా సస్పెండ్ చేశారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యంపై వచ్చే ఆదాయం మీదే సర్కార్ కు ప్రేమ ఎక్కువ అని చెప్పారు.ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే వైసీపీ సభ్యులు సభలో భజన చేస్తున్నారని మండిపడ్డారు. సభ అటెంషన్ డ్రా చేయడానికి సభలో విజిల్ వేశామన్నారు. విజిల్ వేయడంలో తప్పు లేదన్నారు. సభలో నాటుసారా ఆధారాలు టీడీపీ ఎమ్మెల్యేలు బయటపెడుతుంటే సీఎం ముఖం చాటేశారని ధ్వజమెత్తారు.తమ సభ్యుల్ని సస్పెండ్ చేశాకే సభను నడిపిస్తున్నారని మండిపడ్డారు.ప్రతిపక్షం మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వని సభ చరిత్రకెక్కిందని గద్దె రామ్మోహన్ ఎద్దేవా చేశారు.


 గంజాయి తరహాలోనే నాటుసారా.. 

మార్షల్స్ సాయంతో నడుస్తున్న సభ చూస్తే తమకే సిగ్గేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దెప్పిపోడిశారు.   ఈ సందర్భంగా ఆమె మీడియాతో  మాట్లాడుతూ.. ఎంతమందిని సస్పెండ్ చేసినా, చిట్టచివరి సభ్యుడు కూడా కల్తీసారాపై పోరాడతారని హెచ్చరించారు.ప్రజల కోసమే అన్నీ భరిస్తున్నామన్నారు. కల్తీసారా మరణాలపై ఆధారాలతో దొరికేసరికి ప్రభుత్వానికి నోట మాటరావట్లేదన్నారు. ఏపీలో గంజాయి పంట తరహాలోనే నాటుసారా తయారీ జరుగుతోందని ఆదిరెడ్డి భవానీ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-03-22T17:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising