ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగాపురానికి వచ్చే నెలలో శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-12-15T03:19:01+05:30

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి వచ్చేనెలలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఉమ్మడి విశాఖ వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయ అడ్డంకులు తొలగిన వెంటనే పాలనా రాజధానిగా విశాఖ: వైవీ

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి వచ్చేనెలలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఉమ్మడి విశాఖ వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారమిక్కడి ఎండాడలోని పనోరమ హిల్స్‌ సమీపంలో రెండు ఎకరాల్లో నిర్మించనున్న వైసీపీ కార్యాలయం భవనానికి మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్‌ తదితర నేతలతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో సుబ్బారెడ్డి మాట్లాడారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయంగా కూడా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని వసతులతో ఈ వైసీపీ కార్యాలయ భవనం నిర్మిస్తామని తెలిపారు. ఉగాది నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. అదానీ డేటా సెంటర్‌ వస్తే విశాఖలో 40వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Updated Date - 2022-12-15T03:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising