ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chintamohan: దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శ్రీరామ రక్ష

ABN, First Publish Date - 2022-09-24T18:29:02+05:30

దేశంలో పరిస్థితులు బాగోలేవని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: దేశంలో పరిస్థితులు బాగోలేవని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ (Chintamohan) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... దేశంలో రోజు రూ.60 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారని ప్రపంచ ఆహార సంస్థ గణాంకాలు చెపుతున్నాయని తెలిపారు. దేశంలోని ఆస్తులన్నీ బీజేపీ (BJP) అప్పనంగా ఆదానికి కట్టబెడుతోందని ఆరోపించారు. దేశంలోని అన్ని వర్గాలని అణచివేస్తూ కార్పోరేట్ శక్తులకు ప్రోత్సాహిస్తోందని మండిపడ్డారు. బీజేపీలో సరైన నాయకులు లేరన్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయని... సీఎం జగన్ (CM Jagan) విద్యావ్యవస్థని బ్రష్టు పట్టించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar reddy) రాష్ట్రం, దేశం కోసం ఏం త్యాగం చేశారని మెడికల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని మాజీ కేంద్ర మంత్రి ప్రశ్నించారు.


దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్  పార్టీ ఒక్కటే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. గులాం నాభి ఆజాద్ లాంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోబోతోందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్నారు. మంచి భావాలు, సిద్ధాంతాలు కలిగిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు యాత్ర, దేశ వ్యాప్తంగా దిగ్విజయంగా జరుగుతోందని తెలిపారు. ఏపీలో అక్టోబర్ 17 నుంచి 23 వరకు అనంతపూర్, కర్నూల్‌లో రాహుల్ యాత్ర జరగబోతుందని చింతామోహన్ (Former Union Minister) వెల్లడించారు. 

Updated Date - 2022-09-24T18:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising