ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinta mohan: ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షులు చేయడం విప్లవాత్మక నిర్ణయం

ABN, First Publish Date - 2022-09-30T19:48:36+05:30

దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్ (Chinta mohan) అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే (Mallikarjuna kharge) నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో తిరుపతిలో రాజీవ్ గాంధీ (Rajiv gandhi) విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ(Congress party) సంబరాలు చేసుకుంది.  కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ (Former Union Minister) మాట్లాడుతూ... ఎస్సీ వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు కాబోతున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 300 స్థానాల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుందన్నారు. రాష్ట్రంలో 150 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని స్పష్టం చేశారు. 1960లో జవహర్ లాల్ హయాంలో  ఎస్సీ వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్యను అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షులు చేశారని, ఇందిరా గాంధీ హయాంలో జగజ్జీవన్ రామ్ ఏఐసీసీ అధ్యక్షులు అయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలో మల్లికార్జున్ ఖర్గేను అధ్యక్షులు చేయడం విప్లవాత్మక నిర్ణయమని చింతామోహన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-30T19:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising