ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinta mohan: ఇందిరా కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టింది

ABN, First Publish Date - 2022-08-20T17:33:39+05:30

మోదీ ప్రభుత్వం ఇందిరా గాంధీ కుటుంబంపై కక్ష కట్టిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: మోదీ ప్రభుత్వం ఇందిరా గాంధీ కుటుంబంపై కక్ష కట్టిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta mohan) అన్నారు. తిరుపతిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv gandhi) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి చింతా మోహన్ పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ (Priyanka gandhi)పై  పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) వ్వవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని అన్నారు. చైనా .. ఇండియాపై కాలుదువ్వుతున్నప్పటికీ మోదీ సర్కార్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం.. బీజేపీ (BJP) సర్కార్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. జగన్ సర్కార్‌ (Jagan government)పై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని తెలిపారు. 2024లో వైసీపీ (YCP) ఇంటికి పోవడం ఖాయమన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ఎక్కువైందని,  అది కార్పొరేషన్ సంస్థ కాదు.. కరెప్టడ్ సంస్థ అని అన్నారు. అసలు ఏసీబీ (ACB) అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌కు తరలించే.. నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్ఓకు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏం పని అని నిలదీశారు. ఆయన తన మాకాంను కలెక్టరేట్‌కు మారిస్తే ప్రజలు హర్షిస్తారని చింతా మోహన్ హితవుపలికారు.

Updated Date - 2022-08-20T17:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising