ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leaders: బెదిరించి ఎన్నాళ్ళు పరిపాలన సాగిస్తారు?

ABN, First Publish Date - 2022-10-01T19:21:00+05:30

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చి పోయిందని... నిరసన వ్యక్తం చేసే హక్కుకూడా లేదని టీడీపీ మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చి పోయిందని... నిరసన వ్యక్తం చేసే హక్కుకూడా లేదని టీడీపీ మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandramohan Reddy), అమర్నాథ్ రెడ్డి (Amarnath reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... శాసనసభలో ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడారని మండిపడ్డారు. జగన్ (Jagan mohan reddy) అన్ని వ్యాపారాలు  చేసుకోవచ్చు కానీ ఇతరులెవరూ పాలు, ఊరగాయలు కూడా అమ్ముకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. జగన్ (AP CM) అన్ని వర్గాలు సర్వనాశనం చేశారన్నారు. బెదిరించి ఎన్నాళ్ళు పరిపాలన సాగిస్తారని అన్నారు. విడదల రజనీ (Vidadala rajani) ఏం చదివారని వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఎన్టీఆర్‌ (NTR)కు అన్నీ తానై చూసుకున్నానని చెప్పుకునే ఆమె కూడా పేరు మార్పు చేయడంలో తప్పు లేదనడానికి సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి పారిశ్రామికవేత్తలను తరిమికోట్టడం తప్ప కొత్తగా పరిశ్రమలు ఏమైనా తెచ్చారా అని అడిగారు. రాజకీయ బిక్ష పెట్టిన సొంత జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్‌కు గతి లేదని విమర్శించారు. వైసీపీ నేతలు (YCP Leaders) ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. రైతాంగాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్, ఇసుక ప్రీగా ఇస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-10-01T19:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising