ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodali nani: ఆత్మాభిమానం గురించి పవన్ మాట్లాడటం సిగ్గుచేటు

ABN, First Publish Date - 2022-08-22T18:16:16+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఆత్మాభిమానం గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుడివాడ 10వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో కొడాలి నాని (Former minister) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిరంజీవి (Chiranjeevi)ని సోదరుడిగా భావించి ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మాట్లాడారని తెలిపారు. పవన్ కళ్యాణ్ (Janasena chief) పిచ్చి పరాకాష్టకు చేరి చిరంజీవి (Mega star)కి ఆత్మాభిమానం లేదని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.


చంద్రబాబు (Chandrababu naidu)కు వంగి వంగి నమస్కారం చేసి బూట్లు నాకే పవన్ కళ్యాణ్‌ (Pawar star pawan kalyan)కు ఆత్మాభిమానం అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. పకోడి స్వామి అయిన పవన్ కళ్యాణ్‌కు, చెకోడీ భక్తుడైన చంద్రబాబు (TDP Chief) ప్యాకేజీల నైవేద్యం సమర్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఉన్న పుత్రుడు వల్ల ప్రయోజనం లేకపోవడంతో, చంద్రబాబు దత్త పుత్రుడు భజన చేస్తున్నారన్నారు. చంద్రబాబు అండ్ కో, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పలాసకు వెళ్లేందుకు లోకేష్ (Nara lokesh) ఎవరని నిలదీశారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్‌కు , జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)తో పోలికేంటని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ స్థాయి తెలుసుకొని ప్రవర్తించాలని కొడాలి నాని హితవుపలికారు. 

Updated Date - 2022-08-22T18:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising