ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

floods: కృష్ణా నదికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి

ABN, First Publish Date - 2022-08-11T16:30:08+05:30

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది (Krishna river) పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది (Krishna river) పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar), పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో వరద పెరిగింది. జగ్గయ్యపేట మండలం ముత్యాలలో భవానీ ముక్తేశ్వర ఆలయం నీట మునిగింది. కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు వరద ఉధృతితో నిండుకుండలను తలపిస్తున్నాయి.


మరోవైపు ఈ నెల 13 నాటికి  వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి, తదుపరి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

Updated Date - 2022-08-11T16:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising