ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుక్కాని ఉత్సవంలో ఎగసిన మంటలు

ABN, First Publish Date - 2022-12-07T03:09:13+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయ చుక్కాని ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ముక్కంటి ఆలయంలో మహానంది వెనుక వైపున చుక్కాని ఉత్సవం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపశృతి

భయాందోళనతో భక్తుల పరుగులు

ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు గాయాలు

శ్రీకాళహస్తి, డిసెంబరు 6: శ్రీకాళహస్తీశ్వరాలయ చుక్కాని ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ముక్కంటి ఆలయంలో మహానంది వెనుక వైపున చుక్కాని ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఒకసారిగా మంటలు ఎగసిపడటంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఓ సెక్యూరిటీ గార్డు చెయ్యి కాలగా, తొక్కిసలాటలో మరో సెక్యూరిటీ గార్డు చెయ్యి విరిగింది. చుక్కాని తాటిచెట్టుకు పెద్దఎత్తున తాటిమట్టలు పేర్చి జ్యోతి వెలిగించారు. ఏటా ఈ ఉత్సవంలో భక్తులను కట్టడి చేస్తారు. ఈ యేడాది భక్తులను కట్టడి చేయడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చుక్కాని వద్ద పూజలకు హాజరయ్యారు. చుక్కాని వెలిగించే ముందే అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. చుక్కానికి జ్యోతి వెలిగించిన వెంటనే ఒకసారిగా చిటపటలాడుతూ భక్తులపైకి నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. ముందరున్న వారికి తీవ్రంగా సెగ తగలడంతో అందరూ దూరంగా పరుగులు తీశారు. మహానంది నుంచి ఆలయంలోకి వెళ్లే వైపున దారాలు కట్టి ఉండడంతో, వాటికి తగులుకుని కొందరు పడిపోయారు. చుక్కాని పక్కనున్న రూ.750 రాహుకేతు పూజామండపంపై మంటలు ఎగసిపడడంతో సీసీ కెమెరాల వైర్లు, విద్యుత్‌ తీగలు అంటుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీదేవి అనే సెక్యూరిటీగార్డుకు ఎడమచేయి విరిగింది. మరో సెక్యూరిటీగార్డు లక్ష్మికి ఓ చేయి కాలింది.

Updated Date - 2022-12-07T03:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising