ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమలాపురం అల్లర్లలో 46 మందిపై FIR

ABN, First Publish Date - 2022-05-27T00:04:19+05:30

అమలాపురం అల్లర్లలో 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. బీజేపీ నేతలు సుబ్బారావు, రాంబాబుపై కేసు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: అమలాపురం అల్లర్లలో 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. బీజేపీ నేతలు సుబ్బారావు, రాంబాబుపై కేసు పెట్టారు. కాపు నేత నల్లా సూర్యచందర్‌రావు కుమారుడు అజయ్ సహా.. 43 మందిపై కేసు నమోదు చేశారు. అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు. విధ్వంసంపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు. ఈ నెల 20వ తేదీన కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలాపురం (Amalapuram) కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపిస్తే 5 వేల మంది వరకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్యం సాయి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త. మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడు కూడా. ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.

Updated Date - 2022-05-27T00:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising