ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు తీపి కబురు

ABN, First Publish Date - 2022-04-15T00:55:30+05:30

కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. నాలుగు నెలల నైరుతి రుతువనాల సీజన్‌కు సంబంధించి భారత వాతావరణ శాఖ గురువారం తొలిదశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్‌ను విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల (లాంగ్‌ పీరియడ్‌ యావరేజ్‌ 96-104 శాతం) రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం 99 శాతం (ఐదు శాతం అటు ఇటు కావచ్చు) నమోదుకానున్నది. 1971 నుంచి 2020 వరకు వర్షపాతం వివరాలు తీసుకుంటే.. దీర్ఘకాల సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా లెక్కగట్టారు. నాలుగు నెలల సీజన్‌లో దక్షిణభారతం ఉత్తర భాగం దానికి ఆనుకుని మధ్యభారతం, వాయువ్య భారతంలో కొన్ని ప్రాంతాలు, హిమాలయ సానువుల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలు, వాయువ్య భారతంలో కొన్ని ప్రాంతాలు, దక్షిణభారతంలోని దక్షిణభాగంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. 

Updated Date - 2022-04-15T00:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising