ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులకు కుటుంబం బలి

ABN, First Publish Date - 2022-01-09T08:10:29+05:30

అప్పులకు కుటుంబం బలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజవాడలో నిజామాబాద్‌ వాసుల ఆత్మహత్య

అధిక మోతాదులో ఇన్సులిన్‌ తీసుకుని తల్లీకొడుకు..

నదిలోకి దూకి తండ్రీకొడుకు బలవన్మరణం

విజయవాడ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వెతలు నిండు కుటుంబాన్ని ఛిద్రం చేశాయి. నిజమాబాద్‌కు చెందిన ఈ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం.. నిజమాబాద్‌కు చెందిన పప్ప్చు సురేష్‌(56) అక్కడే పెట్రోలు బంక్‌ అద్దెకు తీసుకున్నారు. ఆయన భార్య శ్రీలత(54) ఇంటి వద్ద బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. పెద్ద కుమారుడు అఖిలేశ్వర్‌(28) బీటెక్‌ పూర్తిచేశాడు. రెండో కుమారుడు ఆశీష్‌(22) బీఫార్మసీ పూర్తి చేసి నిజమాబాద్‌లోనే మెడికల్‌ షాపు నిర్వహించేవాడు. ఈ నెల ఆరో తేదీన విజయవాడ వన్‌టౌన్‌ రథం సెంటర్‌లోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అన్నసరత్రంలో వీరు గది అద్దెకు తీసుకున్నారు. సత్రంలో దిగినప్పటి నుంచి వారు బయటకు రాలేదు. సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సురేష్‌ తన బావమరదులకు వాట్సా్‌పలో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని వాయిస్‌ మెసేజ్‌లు పంపారు. ఈ మెసేజ్‌లు విని, వెంటనే విజయవాడలోని సత్రానికి ఫోన్‌ చేశారు. అక్కడి సిబ్బంది ఆ గదికి వెళ్లి చూడగా శ్రీలత, ఆశీష్‌ విగతజీవులై పడి ఉన్నారు. ఇక సురేష్‌, అఖిలేశ్వర్‌ మృతదేహాలను ప్రకాశం బ్యారేజీ 55వ నంబర్‌ ఖానా వద్ద పోలీసులు గుర్తించారు. వారు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీలత, ఆశీ్‌షలు.. చేతులకు ఇన్సులిన్‌, మల్టీవిటమిన్‌ వైల్స్‌ను ఎక్కించుకుని చనిపోయారని తెలుస్తోంది. సత్రం గదిలో నుంచి సిరంజిలు, మల్టీవిటమిన్‌ వైల్స్‌, ఇన్సులిన్‌లను వన్‌టౌన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. నలుగురి మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని పశ్చిమ జోన్‌ ఏసీపీ డాక్టర్‌ కె.హనుమంతరావు పరిశీలించారు. సురేష్‌ కుటుంబం విజయవాడకు రావడానికి రెండు రోజుల ముందు ఓ ప్రైవేటు బ్యాంకు.. నిజమాబాద్‌లో ఉన్న వారి ఫ్లాట్‌ను వేలం వేసింది.  వ్యాపారంలో నష్టాలు, సొంత ఇంటిని బ్యాంకు స్వాధీనం చేసుకోవడం.. ఇత్యాది ఆర్థిక వెతలతోనే నిండు కుటుంబం బలైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Updated Date - 2022-01-09T08:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising