ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు

ABN, First Publish Date - 2022-01-19T16:09:07+05:30

అమరావతి: రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భగ్గుమంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించడంపై ఉద్యోగులు రగులుతున్నారు. హెచ్ఆర్ఏకు కోత, సీసీఏ ఎత్తివేత, క్వాంటం పెన్షన్‌లో మార్పులు చేస్తూ జారీ అయిన చీకటి జీవోలను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ చుక్కలు చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇలాగే ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు, పలు ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, హెచ్ఆర్ఏ పాత స్లాబ్‌లో కొనసాగించాలని, ఉద్యోగుల ప్రయోజనాలను హరించేలా ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ.. గురువారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. అలాగే ఈనెల 28న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Updated Date - 2022-01-19T16:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising