ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆట... పాటతో కదం తొక్కుతున్న ఉద్యోగులు

ABN, First Publish Date - 2022-01-21T22:20:55+05:30

ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అనే సాంగ్‌తో నటి సమంత, పుష్ప మూవీలో దుమ్ములేపింది. ఇప్పుడు ఆ పాట అన్ని మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అనే సాంగ్‌తో నటి సమంత, పుష్ప మూవీలో దుమ్ములేపింది. ఇప్పుడు ఆ పాట అన్ని మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. నోరు తెరిచారంటే చాలు ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ అందరూ మంత్రంలా జపిస్తున్నారు. ఇప్పుడు ఈ పాట ప్రతి ఒక్కరికీ ఓ ఆయుధంగా మారింది. అది నిరసన అయినా ఆందోళన కార్యక్రమైనా... సందర్భం ఏదైనా సరే తమ నిరసనను ఊ అంటావా మావా అనే పాట పల్లవి మార్చి తమ ప్రత్యర్థులపై విసురుతున్నారు. 


‘రివర్స్‌ పీఆర్సీ’పై ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు తమ నిరసనలకు సృజనాత్మకతను కూడా జోడించారు. పేరడీ పాటలతో జగన్‌ సర్కారుకు చురకలు అంటించారు. తమకు న్యాయమైన పీఆర్సీ కావాల్సిందే అంటూ... ‘ఊ అంటావా సీఎం... ఉఊ అంటావా’ అని పాటరూపంలో ప్రశ్నించారు. ‘కొత్త కొత్త జీతాలన్నావు.. పాతపాత జీతాలకు ఎసరుపెట్టావు’ అంటూ దుమ్మెత్తిపోశారు.


మరోచోట...‘ఇంతన్నాడు అంతన్నాడే జగన్‌’ అంటూ చివరికి తమకు మోసం చేశారని మండిపడ్డారు. ఇంకోచోట... ‘అయ్యయ్యో వద్దమ్మా’ ప్రకటనకు పేరడీ కట్టారు. ‘‘అయ్యయ్యో వద్దమ్మా... పక్కనే సీఎం ఉన్నాడు... పెద్ద పీఆర్సీ ఇస్తానన్నాడు... ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్నాడు... మా దగ్గరే పది పైసలు పట్టుకుని పోయాడు... సుఖీభవ... సుఖీభవ’’ అని చిందేశారు. 

Updated Date - 2022-01-21T22:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising