ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెల్లి పెళ్లికి సాయం చేయలేక..

ABN, First Publish Date - 2022-05-21T06:19:19+05:30

ఓ పక్క చెల్లి పెళ్లికి సాయం చేయలేకపోతున్నాననే బాధ, మరోవైపు అప్పుల ఊబిలో ఊపిరాడక ఆందోళన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడి ఆత్మహత్య
తుని, మే 20: ఓ పక్క చెల్లి పెళ్లికి సాయం చేయలేకపోతున్నాననే బాధ, మరోవైపు అప్పుల ఊబిలో ఊపిరాడక ఆందోళన.. చుట్టుముట్టిన సమస్యలతో ఓ యువకుడు విషం తాగి అర్ధా ంతరంగా తనువు చాలించాడు. కాకినాడ జిల్లా తుని పట్టణం గరువువీధికి చెందిన దాడి రవిశంకర్‌ కుమారుడు యువతేజ (26) పాయకరావుపేట మండలం రాజానగరం బీచ్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పడవపై ఉన్న అతని మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు.  
చెల్లి పెళ్లికి సాయం చేయలేక....
  దాడి యువతేజ టెన్త్‌ వరకు చదివాడు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే చదువు తక్కువ కావడంతో అక్కడ ఇచ్చే జీతం సరిపోక తిరిగి ఇంటికి వచ్చేశాడు.  తేజ తండ్రి రవిశంకర్‌ తోపుడుబండిపై టిఫిన్‌ అమ్ముతుండడంతో అతనికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే తన వ్యక్తిగత అవసరాల కోసం యువతేజ చిన్నచిన్న అప్పులు చేసేవాడు. అవికాస్తా పీకకు చుట్టుకున్నాయి.  ఈ సమయంలోనే తన చెల్లికి పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో తాను ఏమి సాయం చేయలేకపోతున్నాననే ఆందోళన ఎక్కువైంది.  తండ్రికి సాయంగా ఉండాల్సిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనువు చాలించాలని నిర్ణయించుకుని గురువారం ఉదయమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చివరికి బీచ్‌లో విషం తాగి చనిపోయాడు.

Updated Date - 2022-05-21T06:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising