ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిస్తుకు శఠగోపం!

ABN, First Publish Date - 2022-07-01T06:33:40+05:30

దేవుడి భూమి శిస్తుకు శఠగోపం పెట్టాడు ఓ వైసీపీ నాయకుడు. మండలంలోని రెల్లుగడ్డలో గోడి ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన 7.56 ఎకరాల భూము లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం వీటికి వేలం పాట నిర్వహించగా ఏడాదికి రూ.9 లక్షలు చొప్పున మూడేళ్ల కాలానికి రూ.27 లక్షలకు రెల్లుగడ్డ గ్రామానికి చెందిన వైసీపీ నేత నడింపల్లి నాగరాజు తన భార్య, మాజీ సర్పంచ కుమారి పేరున దక్కించుకున్నాడు.

ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు ఆక్వా చెరువులుగా మారిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గోడి ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం భూమి శిస్తు ఎగ్గొట్టిన వైసీపీ నేత
  • మూడేళ్లకు రూ.27 లక్షలకు రూ.4.50 లక్షలే చెల్లిం
  • దేవదాయ శాఖ నిర్లక్ష్యమే కారణం

అల్లవరం, జూన 30: దేవుడి భూమి శిస్తుకు శఠగోపం పెట్టాడు ఓ వైసీపీ నాయకుడు. మండలంలోని రెల్లుగడ్డలో గోడి ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన 7.56 ఎకరాల భూము లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం వీటికి వేలం పాట నిర్వహించగా ఏడాదికి రూ.9 లక్షలు చొప్పున మూడేళ్ల కాలానికి రూ.27 లక్షలకు రెల్లుగడ్డ గ్రామానికి చెందిన వైసీపీ నేత నడింపల్లి నాగరాజు తన భార్య, మాజీ సర్పంచ కుమారి పేరున దక్కించుకున్నాడు. అయితే ఇప్పటికి రూ.4.50 లక్షలు మాత్రమే చెల్లించారు. పాట కాల పరిమితి ముగియడంతో రూ.22.50 లక్షల బకాయి చెల్లించాలంటూ దేవదాయ శాఖ నోటీసుతో పాటు లాయరు నోటీసు పంపించారు. శివాలయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువు లుగా తవ్వించి రికార్డు స్థాయిలో శిస్తులు పెంచారని సంతోషిం చాలా లేక దేవదాయ శాఖ అధికారులు శిస్తు బకాయిలు వసూలు చేయలే దని బాధపడాలా అని భక్తులు విమర్శిస్తున్నారు. మరో వారంలో వేలం పాట నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆ చెరువుల్లో రొయ్యలు పట్టిన వెంటనే దేవదాయ శాఖ శిస్తు వసూలు చేసి ఉంటే బకాయి ఇంతగా పేరుకుపోయేది కాదని, అధి కారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. పోటీపడి పాడుకున్న సదరు వైసీపీ నేత సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి బకాయిల వసూళ్లలో జాప్యం చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కార్యనిర్వహణాధికారి  సాయిరామ్‌ మాట్లాడుతూ.... పాటదారుడు కట్టిన ధరావతు పోగా మిగిలిన శిస్తు బకాయిపై న్యాయస్థానానికి వెళ్తామన్నారు. తక్షణం శిస్తు చెల్లించాలని పాట దారుడికి పలుమార్లు దేవదాయ శాఖ తరపున నోటీసులతో పాటు ప్లీడరు నోటీసు ఇచ్చినట్టు ఈవో చెప్పారు.


Updated Date - 2022-07-01T06:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising