ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ABN, First Publish Date - 2022-03-16T06:36:53+05:30

వైసీపీ పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, టీడీపీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధుర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, మార్చి 15: వైసీపీ పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, టీడీపీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధుర్‌ అన్నారు. వెదిరేశ్వరంలోని స్టీల్‌ప్లాంట్‌ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈసందర్భంగా బండారు మాట్లాడుతూ వైసీపీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రం 25ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలు చెప్పడంలో గిన్నీస్‌బుక్‌ రికార్డును కూడా దాటిన ఘనత వైసీపీ నాయకులకు  దక్కుతుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు, ప్రభుత్వ ధనం లూటీ, నేరాలు, ఘోరాలతో పాలనసాగిస్తున్నారన్నారు.  బాబాయ్‌ వివేకానంద హత్యఉదంతంలో తెలుస్తున్న  నిజాలు దిగ్ర్భాంతిని కలిగిస్తున్నాయన్నారు. మద్యం, ఇసుక, రేషన్‌బియ్యం, ఎర్రచందనం లూటీలు చేస్తూ అబద్ధాలు, మోసాలతో రాష్ట్రాన్ని అదోగతి పాల్జేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం హరీష్‌ మాధుర్‌ మాట్లాడుతూ కక్షసాధింపు చర్యలే ధ్యేయంగా వైసీపీ పాలన సాగిస్తుందన్నారు. ఇసుక దోపిడీ చేయడంలో వైసీపీ కీలక భూమిక పోషిస్తుందని ఆరోపించారు. ప్రక్కరాష్ట్ర ప్రయోజనాల కోసం సొంత రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, చిలువూరి సతీష్‌రాజు, కరుటూరి నరసింహారావు, సయ్యపురాజు రామకృష్ణంరాజు, పెచ్చెట్టి విజయలక్ష్మి, కాసురెడ్డి, పెచ్చెట్టి చిన్నారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-03-16T06:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising