ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాం మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2022-02-23T06:25:55+05:30

రాయవరం మండలం చెల్లూరు శివారు యర్రమట్టిపురం వద్ద వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న యానాం మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ అమలాపురం డివిజన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీనివాసరావు మంగళవారం విలేకరులకు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం, ఫిబ్రవరి 22: రాయవరం మండలం చెల్లూరు శివారు యర్రమట్టిపురం వద్ద వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న యానాం మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ అమలాపురం డివిజన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీనివాసరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు ఎస్‌ఈబీ రామచంద్రపురం ఎస్‌ఐ వి.రవికుమార్‌కు వచ్చిన సమాచారంతో రాయవరం, రామచంద్రపురం ఎస్‌ఈబీ సీఐలు వేణుమాధవ్‌, సీహెచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం వేకువజామున తనిఖీలు నిర్వహించారు. యర్రమట్టిపురం వద్ద ట్రక్కును ఆపి తనిఖీ చేయగా ప్లాస్టిక్‌ ప్లేట్స్‌ వెనుక దాచి ఉంచిన 599 బీరు సీసాలు, వివిధ బ్రాండ్‌లకు చెందిన 672 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ యానాం రేట్ల ప్రకారం సుమారు రూ.2.10 లక్షలు, ఏపీ విలువ ప్రకారం సుమారు రూ.3 లక్షలు ఉంటుందని, ట్రక్కు విలువ రూ.5 లక్షలుగా అంచనా వేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులతో పాటు డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. తనిఖీల్లో రాయవరం ఎస్‌ఐ శేఖర్‌బాబు, కేవీడీవీ ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T06:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising