ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొదుపు సంఘాల్లో రుణాల కుదుపు !

ABN, First Publish Date - 2022-11-22T01:40:15+05:30

మహిళా శక్తి సంఘాల్లో రుణాల కుదుపు ఏర్పడింది. ఒక బ్యాంకులో రుణాలు ఉండగానే ఇతర సభ్యులకు తెలియకుండా సంఘం ప్రెసిడెంట్‌, సెక్రటరీలతో వీవోఏలు కుమ్మక్కై కోట్లా ది రూపాయిల రుణాలను అడ్డగోలుగా పొందిన సంఘటన కాకినాడ రూ రల్‌లో జరిగింది. మహిళా సమాఖ్యపై వెలుగు ఉన్నతాధికారుల పర్యవేక్ష ణ లోపంతో ఈ అక్రమాల్లో డీపీఎం, ఏసీ, ఏపీఎం సహాయ సహకారాలు ఉండడంతో ఓ సీసీ అన్నీ తానై గ్రూపుల తరలింపు కోసం డబ్బులు తీసు కుని సంతకాలు పెట్టడంతో రుణాలు పొందారు.

మండల స్త్రీశక్తి భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరప మండలం బరోడా బ్యాంకునుంచి అడ్డగోలుగా రూ.కోట్లలో రుణాలు

  • రుణాల మంజూరులో వెలుగు అధికారుల లీలలు

  • చక్రం తిప్పిన ఓ సీసీ, 9మంది వీవోఏలు

  • నకిలీ, బినామీ గ్రూపుల పేరిట రుణాలు

  • రూ.5కోట్లు తీసుకున్న వీవోఏలు

సర్పవరం జంక్షన్‌, నవంబరు 21: మహిళా శక్తి సంఘాల్లో రుణాల కుదుపు ఏర్పడింది. ఒక బ్యాంకులో రుణాలు ఉండగానే ఇతర సభ్యులకు తెలియకుండా సంఘం ప్రెసిడెంట్‌, సెక్రటరీలతో వీవోఏలు కుమ్మక్కై కోట్లా ది రూపాయిల రుణాలను అడ్డగోలుగా పొందిన సంఘటన కాకినాడ రూ రల్‌లో జరిగింది. మహిళా సమాఖ్యపై వెలుగు ఉన్నతాధికారుల పర్యవేక్ష ణ లోపంతో ఈ అక్రమాల్లో డీపీఎం, ఏసీ, ఏపీఎం సహాయ సహకారాలు ఉండడంతో ఓ సీసీ అన్నీ తానై గ్రూపుల తరలింపు కోసం డబ్బులు తీసు కుని సంతకాలు పెట్టడంతో రుణాలు పొందారు. కరప బ్యాంకు ఆఫ్‌ బరో డానుంచి మండల సమాఖ్య పరిధిలో 120 గ్రూపులకు రూ.15కోట్ల రుణా లు తీసుకోగా ఇందులో 50 నకిలీ, బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి అక్రమ మార్గాన 9మంది వీవోఏలు రూ.5కోట్లకు పైనే రుణాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ విచారణకు ఆదేశించారు.

మహిళా మండల సమాఖ్య పనితీరు

కాకినాడరూరల్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(వెలుగు) ఆధ్వ ర్యంలో 3,552 మహిళా శక్తి సంఘాలుండగా ఇందులో 35,588 సభ్యులుగా ఉన్నారు. మహిళా సమాఖ్య ఏర్పాటైన నాటి నుంచి నేటివరకు కోట్లాది రూపాయలు పొదుపు పాటిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకులు రుణాలు విరివిగా రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక పురోగతి సాధించేందుకు కృషిచేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ బ్యాంకులు సంఘాలకు రూ.9082 కోట్లను రుణాలు అందించాయి.

పర్యవేక్షణ లోపంతో...

డ్వాక్రా సంఘాల సక్రమ పనితీరుకోసం వెలుగు ఆధ్వర్యంలో మండలానికి ఒక ఏపీఎం, క్లస్టర్‌ కోఆర్డినేటర్‌(సీసీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. క్షేత్రస్థాయిలో డ్వాక్రా సంఘాలు, బ్యాంకులకు అనుసంధానకర్తలుగా వీవోలు ఉంటూ పొదుపు జమ, రుణాల మంజూరులో సేవలు అందించే లా చర్యలు తీసుకున్నారు. వీరిపై పర్యవేక్షణ బాధ్యతలు క్లస్టర్‌ కోఆర్డినేటర్‌లపై ఉంది. సీసీలపై ఏపీఎం పర్యవేక్షణ చేస్తుంటారు. ఏపీఎంలపై ఏరి యా కోఆర్డినేటర్‌, డివిజన్‌ పరిధిలో డీపీఎం పర్యవేక్షణ చేస్తుంటారు. డ్వా క్రా సభ్యుల కార్యకలాపాలు ఆర్థిక లావాదేవీతో ముడిపడడంతో వెలుగు సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ రుణాల మంజూ రు, చెల్లింపులో గ్రూపు సభ్యులకు ఓ యానిమేటర్‌, ప్రెసిడెంట్‌, సెక్రటరీ మధ్య తలెత్తిన వివాదంతో అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రుణాల కోసం అడ్డగోలుదారులు

మండల మహిళా సమాఖ్యలోని గ్రూపులకు రుణాల చెల్లింపును బట్టి బ్యాంకులు విరివిగా కోట్లాది రుణాలు ఇస్తున్నాయి. నెలవారీ పొదుపు, చెల్లింపులు సక్రమంగా చేయడంతో కరపకు చెందిన బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోఐ) టార్గెట్‌ చేరుకునేందుకు ఇక్కడ ఒక్కో గ్రూపునకు రూ.20లక్షలు ఇస్తామన్నారు. సీసీ, ఏపీఎంలకు భారీ నగదు ప్రోత్సాహం, వీవోఏలకు రూ.1500 ముట్టచెప్పేందుకు ముందుకు వచ్చారు. 2021, మార్చిలో రమణయ్యపేట స్త్రీశక్తి భవనంలో ఏపీఎం ఆధ్వర్యంలో బీఓఐ అధికారులు సమా వేశం ఏర్పాటు చేశారు. తిమ్మాపురం, పి.వెంకటాపురం, వాకలపూడి, సూ ర్యారావుపేట, ఇంద్రపాలెం, వలసపాకల, రాయుడుపాలెం, రమణయ్యపే ట, గైగోలుపాడు, తూరంగి, చీడిగ గ్రామాల్లో ఉన్న 120 గ్రూపులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15కోట్లు రుణాలు ఇచ్చారు. ఇందులో 9మంది వీవోఏలు ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రూపుల్లో ఉండి అడ్డగోలుగా పాతగ్రూపుల పేర్లతో రూ.5కోట్లపై బడి రుణాలు పొందారు. వాకలపూడిలో ప్రెసిడెంట్‌, సెక్రటరీలు కలసి రూ.15లక్షలు రుణం తీసుకున్నట్లు సభ్యులకు తెలియకపోవడంతో వివాదం వెలుగులోకి వచ్చింది.

ఇదిగో ఓ వీవోఏ లీలలు

తిమ్మాపురంలో ఓ వీవోఏ సరికొత్త పంథాలో బ్యాంకు నుంచి రూ.1.80 కోట్లు వరకు రుణం తీసుకుంది. స్థానికంగా ఉండే గ్రూపు పేరులో ఉన్న ప్రెసిడెంట్‌, సెక్రటరీలను మార్చి పలు గ్రూపుల పేరుతో రుణం తీసుకుంది. తుని, అమలాపురం, తిమ్మాపురం, వాకలపూడి గ్రూపుల్లో ఉన్న ప లువురు కుటుంబసభ్యుల వివరాలు పెట్టి ఫోర్జరీ సంతకాలతో రుణం పొం దింది. విచారణకోసం వెళ్లిన సిబ్బందికి సహకరించకుండా తనకు రాజకీ య పరపతి ఉందని, సహకరించేదిలేదని చెప్పడం గమనార్హం. ఈ వీవో ఏనుంచి సదరు సీసీ రూ.40లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఇదే తరహాలో మిగతా వీవోఏలు 50 గ్రూపులను నకిలీ, ఫోర్జరీ గ్రూపులు సృష్టించి రుణా లు పొందినట్లు తెలిసింది. దీనిపై పీడీ విచారణకు ఆదేశించారు. సీసీ పా త్రపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుణాల కో సం ఒక్కో గ్రూపునుంచి రూ.2వేలతోపాటు సభ్యురాలి నుంచి తలో రూ.వె య్యి వసూలు చేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో 15 మంది వీవోఏలు ఉండగా ఇందులో 9మంది రుణాల స్వాహాకు పాల్పడి నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సీసీకి వెలుగులోని ఓ డీపీఎం, ఏసీలు డబ్బులు తీసుకుని సహకరిస్తున్నట్లు ఆరోపించారు.

నివేదిక ఆధారంగా చర్యలు: శ్రీరమణి, పీడీ, డీఆర్‌డీఏ

మండల మహిళా సమాఖ్యలో రుణాల చెల్లింపు, కరప బ్యాంకుకు గ్రూపుల తరలింపు ఓ సీసీతోపాటు వెలుగు సిబ్బందిపై విచారణకు ఆదేశించాం. విచారణ పూర్తికాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-11-22T01:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising