ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎప్పటికి పూర్తయ్యేనో!

ABN, First Publish Date - 2022-09-26T05:28:44+05:30

ఎంతో అట్టహాసంగా నిర్మాణాలు ప్రారంభించిన ప్రభుత్వ భవనాలు సగంలో నిలిచిపోయాయి.

అసంపూర్తిగా నిలిచిపోయిన సచివాలయం తదితర భవనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నడిపల్లిలో సగంలో నిలిచిపోయిన సచివాలయం, ఆర్‌బీకే, ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణాలు 

పెరవలి, సెప్టెంబరు 25: ఎంతో అట్టహాసంగా నిర్మాణాలు ప్రారంభించిన ప్రభుత్వ భవనాలు సగంలో నిలిచిపోయాయి. నడిపల్లి పంచాయతీ పరిధిలో రైతు భరోసా కేంద్రం, సచివాల యం, ఆరోగ్య కేంద్ర భవనాలు ఒకే చోట నిర్మాణాలు ప్రారంభిం చారు. సచివాలయానికి 40లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.21.80 లక్షలు, ఆరోగ్య కేంద్రానికి రూ.17.50 లక్షలు కేటా యించి నిర్మాణాలు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్‌ వాటిని స్లాబ్‌లు వరకు పూర్తి చేసి అప్పటివరకు రావాల్సిన సొమ్ములను  బిల్లు చేసుకుని వెళ్లిపోయాడు. మిగిలిన పనులు చేయడం నా వల్ల కాదని ముందు పెట్టుబడి పెట్టి చేస్తే సొమ్ములు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఉందని ప్రస్తుతం పెరిగిన రేట్లు ప్రకారం గిట్టుబాటు కూడా కాదని  చేతులెత్తేశారు. దీంతో నిర్మా ణం ఎప్పటికి పూర్తి అవుతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అయిన బిల్లు రూ.42 లక్షలు కాంట్రాక్టర్‌ తీసుకున్నారని మిగిలిన పనులు చేయడానికి ఎవరు ముందుకు వస్తారని వాపోతున్నారు. 

త్వరలో పనులు ప్రారంభమవుతాయి: సర్పంచ్‌

గ్రామంలో నిర్మించవలసిన ఆర్‌బీకే సచివాలయం, ఆరోగ్యకేం ద్ర భవనాలు స్లాబ్‌లు వరకు పూర్తయ్యాయని సర్పంచ్‌ బీరా సత్తివేణిరాజు చెప్పారు. మిగిలిన పని చేయడానికి పాత కాంట్రా క్టర్‌ నిరాకరించడంతో కొత్త కాంట్రాక్టర్‌తో పనులు చేయించడానికి నిర్ణయించాం. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. 

Updated Date - 2022-09-26T05:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising