ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం సొమ్ము రాకుండా హమాలీ చార్జీల భారం

ABN, First Publish Date - 2022-05-23T06:33:03+05:30

రైతులకు ధాన్యంసొమ్ము రాకుండా హామాలీ చార్జీలు వసూలు చేయడం, వారిపై భారం మోపుతుందని వైసీపీ నేత గూడాల సర్పంచ్‌ దాకారపు చిరంజీవిరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లవరం, మే 22: రైతులకు ధాన్యంసొమ్ము రాకుండా హామాలీ చార్జీలు వసూలు చేయడం, వారిపై భారం మోపుతుందని వైసీపీ నేత గూడాల సర్పంచ్‌ దాకారపు చిరంజీవిరావు అన్నారు. ఇతర మండలాల్లో లేనివిధంగా ధాన్యం పట్టుబడికి కళ్లాల వద్దే హామాలీ చార్జీలు వసూలు చేయడం తగదన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యంకొనుగోలు చేస్తూ బస్తాకు రూ.40లు వసూలు చేస్తున్నారని, ఇది కష్టాల్లో ఉన్న రైతుపై పెనుభారం మోపుతుందన్నారు. తమ గ్రామంలో 2200క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని, తూకాల్లో ఒక కిలో అదనంగా రైతుధాన్యం  లాగేయడం అన్యాయమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు సర్పంచ్‌ చిరంజీవిరావు తెలిపారు. హమాలీచార్జీలు సొసైటీ ద్వారా చెల్లింపులు జరిగేవని, క్వింటాల్‌కు రూ.25లు ఇస్తారని, ఆ సొమ్ము రిలీజ్‌ కానందునే రైతుల నుంచి రూ.25 చొప్పున వసూలు చేస్తున్నారని మండల వ్యవసాయాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ నిధులు  విడుదలయ్యాక  క్వింటాల్‌కు రూ.25చొప్పున హమాలీ చార్జీలు  రైతు ఖాతాల్లోకి జమచేస్తారని ఆయన వివరణ ఇచ్చారు.  అల్లవరం మండలంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా 2700 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు.



Updated Date - 2022-05-23T06:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising