ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అల’జడి

ABN, First Publish Date - 2022-05-17T06:47:26+05:30

తుఫాన అనంతర పరిస్థితుల్లో కోనసీమలోని బంగాళాఖాతం సముద్ర తీరంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు సముద్రం తీవ్రమైన అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరాన్ని తీవ్రంగా కోతకు గురిచేసింది.

అంతర్వేది తీరంలో ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆందోళనలో స్థానికులు
  • ఇసుక తవ్వకాలతో కోనసీమలో కరుగుతున్న తీరం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

తుఫాన అనంతర పరిస్థితుల్లో కోనసీమలోని బంగాళాఖాతం సముద్ర తీరంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు సముద్రం తీవ్రమైన అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరాన్ని తీవ్రంగా కోతకు గురిచేసింది. పౌర్ణమి పోటుతో ఆదివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సముద్రం బంగాళాఖాతం తీరంలో తీవ్ర అలజడి సృష్టించింది. అనూహ్యమైన రీతిలో ముందుకు చొచ్చుకువచ్చి తీరాన్ని ముంచెత్తింది. అంతర్వేది బీచ నుంచి ప్రారంభమై యానాం వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడి తీరంలో అలజడి సృష్టించింది. ముఖ్యంగా అంతర్వేది తీరం వద్ద సముద్రం వందల మీటర్ల మేర ముందు కొచ్చి పర్యాటకులను భయాందోళనకు గురిచేసింది. తీరం వెంబడి ఉన్న దుకాణాలు, వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వంటివి పౌర్ణమి పోటుకు సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో నీళ్లపాలయ్యాయి. అంతర్వేది, కేశవదాసుపాలెం, కేశనపల్లి, ఓడలరేవు, కొమరగిరిపట్నం, రామేశ్వరం, ఎస్‌.యానం, చిర్రయానం, కందికుప్ప వంటి తీర ప్రాంతాల వెంబడి పల్లపు ప్రాంతాలు అలలకు జలమయమయ్యాయి. తీరంలో ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకాలతో పాటు ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్న పరిస్థితులతో సముద్రపు అలలు గ్రామాల్లోకి  చొచ్చుకు వస్తున్నాయని తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-05-17T06:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising