ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యోమగామి కావడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-07-07T07:35:50+05:30

వ్యోమగామి కావడమే తన తదుపరి లక్ష్యమని జాహ్నవి దంగేటి స్పష్టంచేశారు. పోలెండ్‌లో నిర్వహించిన ఆస్ట్రా 45 మిష న్‌ను పూర్తి చేసుకుని అతి చిన్ని వయస్సులో శిక్షణ పొందిన వ్యోమగామిగా రికార్డు సాధించిన జాహ్నవికి రాజమహేంద్రవరంలో ఘనస్వాగతం లభించింది.

జాహ్నవిని పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలెండ్‌లో ఆస్ట్రా మిషన్‌ 45 పూర్తి చేసుకున్న జాహ్నవి దంగేటి
రాజమహేంద్రవరం సిటీ, జూలై6: వ్యోమగామి కావడమే తన తదుపరి లక్ష్యమని జాహ్నవి దంగేటి స్పష్టంచేశారు. పోలెండ్‌లో నిర్వహించిన ఆస్ట్రా 45 మిష న్‌ను పూర్తి చేసుకుని అతి చిన్ని వయస్సులో శిక్షణ పొందిన వ్యోమగామిగా రికార్డు సాధించిన జాహ్నవికి రాజమహేంద్రవరంలో ఘనస్వాగతం లభించింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన జాహ్నవి గతంలో నాసాకు ఎంపికై వ్యోమగామిగా పది రోజులు శిక్షణ పొందిందారు. తర్వాత పోలెండ్‌లో అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో 15 రోజుల శిక్షణ పొంది అక్కడ ఆస్ట్రా 45 మిషన్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి ఈనెల 5న చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో రాజమహేంద్రవరం బుధవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. అతి చిన్నవయస్సులో వ్యోమగామి శిక్షణ పొం దిన యువతిగా రికార్డు సాధించడం, ఈ శిక్షణను విజయంతంగా పూర్తి చేయ డం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే ఇండియాబుక్‌ ఆఫ్‌ రికార్డు, లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డులు సాధించినట్టు వివరించారు. తన తల్లిదండ్రులు దంగేటి శ్రీనివాసరావు, పద్మశ్రీలు గల్ఫ్‌ కంట్రీలో ఉన్నారని, తాను చిన్ననాటి నుంచి తన అమ్మమ్మ లీలావతి వద్ద పాలకొల్లులో ఉండి చదువుకున్నానని చెప్పారు. ప్రస్తుతం పంజాబ్‌ జలంధర్‌లో ఎల్పీ యూనివర్సిటీలో బీటెక్‌ ఈసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నానన్నారు. పోలెండ్‌లో వ్యోమగాముల శిక్షణకు కేవలం ఆరుగురినే ఎంపిక చేశారని, ప్రపంచ దేశాల్లో ఆసియా ఖండం నుంచి తాను మాత్రమే భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణమన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తాను అంతరిక్షంలోకి ప్రవేశించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. వ్యోమగామిలో భాగమైన పైలెట్‌ను కావాలనే కోరిక ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కుడి పూడి పార్థసారథి వ్యోమగామి శిక్షణ పొందిన జాహ్నవిని పుష్పగుచ్ఛంతో అభి నందించారు. అనంతరం జాహ్నవి కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలతను కలిశారు. వ్యోమగాముల శిక్షణలో భారతదేశం తరపున ప్రాతినిధ్య వహించి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన జాహ్నవిని కలెక్టర్‌ అభినందించారు.

Updated Date - 2022-07-07T07:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising