ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌లోకి పి.గన్నవరం ఎస్‌ఐ

ABN, First Publish Date - 2022-05-23T06:26:25+05:30

కుందాలపల్లిలో హిజ్రాలతో రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఆడిస్తున్నారనే కారణంగా కొందరు యువకులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై స్థానిక ఎస్‌ఐ జి.సురేంద్రను వీఆర్‌లో ఉంచామని కోనసీమ జిల్లా ఎస్పీ కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, మే 22: కుందాలపల్లిలో హిజ్రాలతో రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఆడిస్తున్నారనే కారణంగా కొందరు యువకులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై స్థానిక ఎస్‌ఐ జి.సురేంద్రను వీఆర్‌లో ఉంచామని కోనసీమ జిల్లా ఎస్పీ కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి తెలిపారు. విచారణ అధికారిగా డీఎస్పీ వై.మాధవరెడ్డిని నియమించామన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కుందాలపల్లి అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, సిబ్బందిని కుందాలపల్లి ఘటనపై ఆరా తీశారు.
ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐగా గంగాభవాని
పి.గన్నవరం ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐగా పి.గంగాభవాని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం టౌన్‌ స్టేషన్‌ నుంచి  ఇక్కడకు ఇన్‌చార్జి ఎస్‌ఐగా వచ్చారు. తొలుత ఏఎస్‌ఐ ఐ.ఏడుకొండలు, సిబ్బంది, స్థానిక నాయకులు ఎస్‌ఐకు ఘనస్వాగతం పలికారు.

Updated Date - 2022-05-23T06:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising