నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడు జగన్
ABN, First Publish Date - 2022-12-31T01:10:03+05:30
నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడు సీఎం జగన్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 30: నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడు సీఎం జగన్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. రాజమహేంద్రవ రం లలితానగర్‌లో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుల ర్పించారు. అనంత రం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విధ్వంసకర విధానాలవల్ల పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి నిరుద్యోగం పెరుగుతోందన్నారు. టీడీపీ హయాంలో నిరుద్యోగులకు రూ.3వేలు భృతిని ఇచ్చారని, నిరుద్యోగ భృతిని రద్దు చేయడంలో సీఎం అంతర్యమేమిటని అన్నారు. దేశంలోనే అత్యధికంగా 1.5 కోట్ల నిరుద్యోగులు కలిగిన రాష్ట్రంగా ఏపీ రికార్డుకెక్కిందన్నారు. అలాగే నేరాల్లో కూడా ముందంజలో ఉందని, ప్రతి 8గంటలకు ఒక మహిళ లైంగిక వేధింపులకు గురవుతోందన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. వచ్చేనెల 27 నుంచి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభిస్తున్నారని 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు మేర పాదయాత్ర ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్, వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, రెడ్డి మణి, మజ్జి పద్మ పాల్గొన్నారు.
‘సీఎంగా జగన్ కొనసాగితే భవిత శూన్యం’
అనపర్తి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి మరో ఐదేళ్ల కొనసాగితే రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు భవిత అనేదే లేకుండా పోతుందని టీడీపీ వాణి జ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తమలంపూడి సుధాకరరెడ్డి అన్నారు. శుక్రవా రం అనపర్తి మండలం చినపొలమూరు దేవస్థానం కాలనీలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జగన్‌రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాల పాలనతోనే రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనుకకు నెట్టారన్నారు. కార్యక్రమం లో మండల పార్టీ అద్యక్షుడు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, తమలంపూడి అమ్మిరెడ్డి, కోశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T01:10:05+05:30 IST