ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పతనం ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-29T06:10:13+05:30

తుని, జూన్‌ 28: అన్నంపెట్టే రైతులకు మోసపూరితమైన హామీలిచ్చి మోసగించడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ రైతు విభాగం ప్రతినిధులతో, రైతులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చే

తునిలో మాట్లాడుతున్న యనమల కృష్ణుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు

తుని, జూన్‌ 28: అన్నంపెట్టే రైతులకు మోసపూరితమైన హామీలిచ్చి మోసగించడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ రైతు విభాగం ప్రతినిధులతో, రైతులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చెరకు, ధాన్యం రైతులు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అమలుకానీ హామిలతో ప్రజలను మాయచేసి ఓట్లు వేయించుకున్న జగన్‌ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని వైసీపీ కార్యకర్తలే ఎదురుచూస్తున్నారన్నారు. వచ్చే నెల 2న జగ్గంపేటలో జరిగే రైతుపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా రైతు విభా గం అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు, కాకినాడ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌, కోటనందూరు, తుని, తొండంగి టీడీపీ మండలా ధ్యక్షులు గాడి రాజుబాబు, అప్పన రమేష్‌, కోడా వెంకటరమణ, పోతల సూరిబాబు, బాబులు, పెంటకోట భాస్కరరావు, పేకేటి హరికృష్ణ, గుడివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising