జిల్లాకు రెండు టూరిజం అవార్డులు
ABN, First Publish Date - 2022-09-28T05:49:53+05:30
ప్రపంచ పర్యాటక దినోతవ్సం సందర్భంగా జిల్లాకు రెండు టూరిజం అవార్డులు లభించాయి.
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ పర్యాటక దినోతవ్సం సందర్భంగా జిల్లాకు రెండు టూరిజం అవార్డులు లభించాయి. జిల్లా టూరిజం అధికారి పి. వెంకటాచలంకు ఉత్తమ టూరిజం అవార్డు లభించింది. రాజమహేంద్రవరానికి చెందిన గోదావరి విహార్ టూర్స్ అండ్ ట్రావెల్స్(బోటింగ్) అధినేత బుద్దరాజు మధుసూదనరాజుకు ఎక్స్‌లెన్స్, బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అవార్డు లభించింది. మంగళవారం తిరుపతిలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో మంత్రి రోజా అవార్డులు అందజేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి ప్రపంచ పర్యాటక దినోత్సవానికి సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆవిష్కరించారు.కార్యక్రమంలో పర్యాటక శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఆర్.గంగబాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-28T05:49:53+05:30 IST