ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా సెంచరీ!

ABN, First Publish Date - 2022-05-24T07:18:07+05:30

మార్కెట్‌లో టమోటాల ధర ఆకాశాన్నంటుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన టమోటా కాయలు కిలో రూ.100 పలికింది. దీంతో కొనలేక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మార్కెట్‌లో రూ.100కు చేరిన టమోటా ధరలు

సామర్లకోట/తొండంగి/గండేపల్లి, మే 23: మార్కెట్‌లో టమోటాల ధర ఆకాశాన్నంటుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన టమోటా కాయలు కిలో రూ.100 పలికింది. దీంతో కొనలేక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రెండురోజుల వరకూ రూ.90 నుంచి రూ.80 మధ్య పలికిన ధర సోమవారం రూ.100కు చేరుకుంది. సోమవారం సామర్లకోట, పెద్దాపురం మార్కెట్లలో 15కిలోల బాక్స్‌ టమోటాల ధర గరిష్ఠంగా రూ.1150 వరకూ పలికింది. నాణ్యతను బట్టి బాక్స్‌ టమోటాలను రూ.900 నుంచి రూ.1150 వరకూ వ్యాపారులు కొనుగోలు చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మండుటెండలు, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడం, ధరలు పెరుగుదలకు కారణమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయడం, రవాణా ఛార్జీలు అధికం కావడం తదితర కారణాలవల్ల స్థానికంగా వీటిని ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని వారు అంటున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలు ఉండడంతో అధిక ధర అయినా తప్పనిసరిగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. నెలరోజులుగా ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ధర బాగా ఉండడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. పెట్టుబడులు పోయి ఎకరానికి రూ.2లక్షల ఆదాయం వస్తుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-24T07:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising