ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ

ABN, First Publish Date - 2022-01-18T06:28:07+05:30

కొవిడ్‌-19 నియం త్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మంగళ వారం నుంచి ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుకు కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదే శాలు జారీ చేశారు.

టీటీడీ కల్యాణ మండపంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి (కాకినాడ), జనవరి 17: కొవిడ్‌-19 నియం త్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మంగళ వారం నుంచి ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుకు కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదే శాలు జారీ చేశారు. ఐదుగురు మించి వ్యక్తులు గుమిగూడ కూడదన్నారు. ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు, ఫార్మ సీలు, మీడియా, టెలికమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసులు, పెట్రోలు బంకులు, విద్యుత్‌ ఉత్ప త్తి, తాగునీరు సరఫరా, పారిశుధ్య మినహా అన్ని సేవలను కర్ఫ్యూ సమయంలో తప్పనిసరిగా మూసివేయాలన్నారు. పారా మెడికల్‌ సిబ్బంది, సర్వీసు ప్రొవైడర్లు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులను తగిన గుర్తింపు కార్డులతో అనుమతిస్తారన్నారు. రైల్వే, బస్‌ స్టేషన్‌, ఎయిర్‌పోర్టులకు వెళ్లే వారు కూడా వేలిడ్‌ టిక్కెట్‌ కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర అంతర్గత, అంతర్‌ రాష్ట్ర సరుకుల రవాణాకు అనుమతి ఉందన్నారు. బహిరంగ ప్రదే శాల్లో మాస్కు తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.100 జరిమానా విధిస్తామన్నారు. వివాహాలు, మతపర మైన సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు గరిష్ఠంగా 200 మందికి మాత్రం అనుమతి ఉంటుందన్నారు. వ్యాపార సంస్థలు, దుకాణాల యజమానులు వినియోగదారులు మాస్కు ధరించేలా చూడాలి. ఒకవేళ ఎవరినైనా మాస్కు లేకుండా లోపలికి అనుమతిస్తే నేర తీవ్రత ఆధారంగా రూ. 10వేలు, నుంచి రూ.25వేలు వరకు జరిమానా విధిస్తారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్ల పరిశీలన

భానుగుడి(కాకినాడ), జనవరి 17: కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అన్నారు. బాలాజీచెరువు సెంటర్లోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పా టుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సోమవారం ఆయన జేసీ కీర్తి చేకూరి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌తో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాల న్నారు. జిల్లాలో ఉన్న ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు అదనంగా రాజ మహేంద్రవరం, అమలాపురంల్లో నూతనంగా ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అన్ని పీ హెచ్‌సీలతో పాటు కొవిడ్‌ సెంటర్లలో పరీక్షలు చేస్తారన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు తమ గృహాల్లో వ్యక్తి గతంగా ప్రత్యేక హోం ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకోలేని వారు ఇంకా ఉన్నారని, వెంటనే వేయించుకోవాలన్నారు. టీటీడీ కల్యాణ మండపంలో పారా మెడికల్‌ సిబ్బంది, ప్రత్యేక డాక్టర్లు, భోజనం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జీజీహెచ్‌కు తరలించే అవకాశం ఉందని కమిషనర్‌ తెలి పారు. పర్యటనలో ఎంహెచ్‌వో డాక్టర్‌ పృధ్వీచరణ్‌, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2022-01-18T06:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising