ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాళ్వాకు పంట విరామం తప్పదా?

ABN, First Publish Date - 2022-12-15T00:22:24+05:30

సార్వాను వదులుకున్నాం... ఇప్పుడు దాళ్వాలో కూడా పంట విరామం తప్పేటట్టు లేదంటూ చల్లపల్లి రైతులు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పలగుప్తం, డిసెంబరు 14: సార్వాను వదులుకున్నాం... ఇప్పుడు దాళ్వాలో కూడా పంట విరామం తప్పేటట్టు లేదంటూ చల్లపల్లి రైతులు మండిపడ్డారు. డ్రెయిన్లు, పంట కాల్వలు తూడు, గుర్రపుడెక్కతో పూడుకుపోయాయి. పొలాల్లోని ముంపునీరు బయటకు పోయే మార్గం కన్పించడం లేదు. దాళ్వా నారు ముంపునీటిలో ఉంది. అసలు సమస్యలు పరిష్కరించకుండా దాళ్వా సాగుపై అవగాహన సదస్సులేమిటని రైతులు వ్యవసాయాధికారి జి.కుమార్‌బాబును నిలదీశారు. చింతలచెరువులో బుధవారం దాళ్వా సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవరి రకాలు పం డించాలో వ్యవసాయాధికారి వివరిస్తుండగా రైతులు అడ్డుతగిలారు. డ్రెయిన్లు, పంటకాల్వల పూడిక సమస్యను పరిష్కరిస్తామని మూడు నెలల క్రితం కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇప్ప టివరకు దాని ఊసే లేదంటూ రైతులు బూసి బుజ్జిదొర, కొల్లు శ్యామ్‌సుందర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చల్లపల్లిలో దాళ్వా సాగు చెయ్యాలంటే తక్షణం రాచకోడు, రావూరికోడు డ్రెయిన్లలో పూడికతియ్యాలి. పంట కాల్వలను శుభ్రం చెయ్యాలి. ఈసమస్యలు పరిష్కరించకుంటే దాళ్వాను కూడా వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు మాదే పెద్దిరాజు, కుంపట్ల త్రిమూర్తులు, కుంచే రెడ్డి, నెల్లి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో సమస్యలపై మాట్లాడతానని చెప్పి ఏవో సదస్సును ముగించారు.

Updated Date - 2022-12-15T00:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising