ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాటిచెట్టు పడి కౌలు రైతు మృతి

ABN, First Publish Date - 2022-12-10T00:48:06+05:30

కరప మండలం గొర్రిపూడి-గురజనాపల్లి రహదారిలో తాటిచెట్టు మీదపడి కౌలు రైతు దుర్మరణం పాలయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, డిసెంబరు 9: కరప మండలం గొర్రిపూడి-గురజనాపల్లి రహదారిలో తాటిచెట్టు మీదపడి కౌలు రైతు దుర్మరణం పాలయ్యాడు. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రిపూడి శివారు మురికోపొర గ్రామానికి చెందిన అరివిల్లి సుబ్బరాజు(56) శుక్రవారం మధ్యాహ్నం పొలం పని ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టు అకస్మాత్తుగా విరిగిపడి ప్రమాదవశాత్తూ అతనిపై పడింది. ఊహించని ఈ ప్రమాదంలో అతని తల ఛిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. తాటిచెట్టు మొదలు బులిగిపోయి ఉండడంతో గాలులకు ఒక్కసారిగా విరిగిపోయి సుబ్బరాజుపై పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. రంపంతో తాటిచెట్టును కోసి వెలికితీసిన మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు అరివిల్లి నాగబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నౌడు రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - 2022-12-10T00:48:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising