ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి బడ్జెట్‌ లెక్కలవరకేనా..

ABN, First Publish Date - 2022-01-28T07:30:39+05:30

‘జిల్లావ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అయినా బడ్జెట్‌ లెక్కల్లో మాత్రం చూపిస్తున్నారు. రహదారులు ఎక్కడిక్కడ పాడైపోయి ఎన్నో ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నా రహదారులను ఎందుకు వేయ డం లేదో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు.

జడ్పీ హాలులో జరిగిన బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ చిక్కాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రహదారులు పాడైనా పట్టించుకున్నారా
  • జడ్పీ బడ్జెట్‌ సమావేశంలో నిలదీసిన ఎమ్మెల్సీ చిక్కాల

‘జిల్లావ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అయినా బడ్జెట్‌ లెక్కల్లో మాత్రం చూపిస్తున్నారు. రహదారులు ఎక్కడిక్కడ పాడైపోయి ఎన్నో ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నా రహదారులను ఎందుకు వేయ డం లేదో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు. గురువారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 4,280 విస్తీర్ణంతో రహదారులు ఉండగా, దాదాపు అన్నిచోట్లా పాడైపోయి ప్రమాదాలతో మరణాలు సంభవిస్తున్నా ఎందుకు రహ దారులు వేయడం లేదని ప్రశ్నించారు. దీనికి అధికారులు స్పందిస్తూ 4,280 కి. మీ విస్తీర్ణంతో రహదారులు ఉంటే, 680 కి.మీ మేర మరమ్మతులు చేస్తున్నామ ని, 17 పనులకు టెండర్లు పిలవడం జరిగిందని, మిగిలిన రహదారుల నిర్మాణా లకూ టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పడంతో, చిక్కాల కలగజేసుకుని కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేలా ప్రభుత్వం చూస్తే కాంట్రాక్టర్లు పను లు చేయడానికి ముందుకు వస్తారని, కాంట్రాక్టర్ల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రావాల్సిన గ్రాంట్లు అన్ని వచ్చాయా, 14వ ఆర్థిక సంఘం నిధులు ఎంత వచ్చా యో తెలపాలని చిక్కాల ప్రశ్నించగా అధికారులు దాటవేశారు. జిల్లావ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలను ఎన్నికచేసి, వాటి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పి నా ఇప్పటివరకూ ఎన్ని పంచాయతీలకు ఎంత నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండు చేశారు. గొల్లప్రోలు జడ్పీటీసీ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవ ర్గంలో చేపట్టాల్సిన నిర్మాణ పనులపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసు కోవాలని కోరారు. వరరామచంద్రపురం జడ్పీటీసీ మాట్లాడుతూ రాకపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో గత రెండున్నరేళ్లుగా 30 గ్రామాల ప్రజలు రాకపోక లకు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-01-28T07:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising