భార్య బట్టలు ఉతకలేదని.. భర్త ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-12-16T00:21:21+05:30
భార్య బట్టలు ఉతకలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
కొవ్వూరు, డిసెంబరు 15 : భార్య బట్టలు ఉతకలే దని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.పట్టణ సీఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం. కొవ్వూరు మండ లం వాడపల్లి గ్రామానికి చెందిన మిద్దె బాలాజీ (42) తరచుగా మద్యం సేవించి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల ఒకటవ తేదీన భార్యను బట్టలు ఉతకమన్నాడు.అనారోగ్యంగా ఉండడంతో బట్టలు ఉతక లేదు. దీంతో భార్యతో ఘర్షణపడ్డాడు.డిసెంబరు రెండో తేదీ తెల్లవారుజామున వాంతులు చేసుకుంటుండగా కుటుంబసభ్యులు గమనించి కొవ్వూరు ప్రభుత్వ ఆసు పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Updated Date - 2022-12-16T00:21:23+05:30 IST